: 'వంగవీటి' సినిమాలో 'కమ్మ కాపు' పాటను తీసేసిన వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే ఏదో ఒక వివాదాస్పద అంశం దానితో ముడిపడి ఉంటుంది. తాజాగా ఆయన తీసిన 'వంగవీటి' సినిమా ఇప్పటికే సంచలనంగా మారింది. విజయవాడలో జరిగిన ముఠా తగాదాల నేపథ్యంలో ఆయన ఈ సినిమా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని 'కమ్మ కాపు' అనే పాటను తీసేస్తున్నట్టు వర్మ తెలిపాడు. ఈ సినిమా భావోద్వేగాలతో కూడుకున్నదని... ఏ ఒక్కరికీ సంబంధించినది కాదని వర్మ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఆడియోను రేపు విజయవాడలో లాంచ్ చేస్తున్నారు. 23వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మరోవైపు, వాస్తవాలకు విరుద్ధంగా సినిమాను నిర్మిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు.