: హైటెక్ సిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం... మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం


ఈ ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయింది. వివరాల్లోకి వెళ్తే, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న నవీన (21) తన స్కూటీపై ఆఫీస్ కు వెళుతుండగా... వాహనం అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటననలో తీవ్రంగా గాయపడ్డ ఆమె... అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన హైటెక్ సిటీ సమీపంలో ఉన్న కొండాపూర్ ప్రాంతంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... ఆమె మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News