: ఏపీకి తప్పిన ముప్పు... పుదుచ్చేరి, కడలూరులో వర్ష బీభత్సం
ఏపీకి నాడా తుపాను ముప్పు తప్పింది. మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఈ ఉదయం తమిళనాడులోని కారైకల్ దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో పుదుచ్చేరి, కడలూరు ప్రాంతాల్లో కుంభవృష్టి పడుతుండగా, జనజీవనం అస్తవ్యస్తమైంది. తమిళనాట కోస్తా తీరంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. తుపాను తీరం దాటిన తరువాత మాత్రమే సహాయక చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. నాడా తుపాను ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఈ మధ్యాహ్నానికి తుపాను ప్రభావం పూర్తిగా తగ్గుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.