: ఇది సరికాదు...గతంలో ఇలా జరగలేదు: మమతా బెనర్జీ
టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాలను రంగంలోకి దించుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే నోట్ల రద్దు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ, రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆమె చెప్పారు. టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ వసూలుకు డేట్ దగ్గరపడడంతో కేంద్రం పశ్చిమ బెంగాల్ లో ఉన్న రెండు టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. దీనిపై రాష్ట్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా కేంద్రం బలగాలను పంపించడం ఇంతవరకు జరగలేదని, ఇది చాలా సున్నితమైన అంశమని, ఇలాంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు.