: తిరుమలలో భారీ వర్షం..భక్తులకు ఇబ్బంది


బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగండం ప్రభావం కారణంగా తిరుమలలో ఈరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో, తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలలో నిల్చున్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి తోడు, ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో కాలినడక దారిలో చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్డులో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News