: కొత్త పెళ్లికొడుకు యువరాజ్ కు సలహాలు ఇస్తానన్న గంభీర్


తన ప్రియురాలు, మోడల్ హాజల్ కీచ్ ను టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ బుధవారంనాడు పెళ్లి చేసుకున్నాడు. చండీగఢ్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా రాందేవ్ సింగ్ డేరాలో ఈ వివాహం పంజాబీ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా క్రికెటర్ గంభీర్ యువరాజ్ ను ఉద్దేశించి సరదాగా ట్వీట్లు చేశాడు. పెళ్లిలో ధరించిన షేర్వాణీ కింద ఓ చెస్ట్ గార్డ్ ను యువీ ధరించి ఉంటాడని చెప్పాడు. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత ఎదురయ్యే బౌన్సర్లను ఎదుర్కోవడానికి ఇంతవరకు ఎలాంటి చెస్ట్ గార్డ్ లు తయారు చేయలేదని తెలిపారు. మైదానంలో కాక, బయట కూడా బౌన్సర్లను ఎలా ఎదుర్కోవాలో ఈ సారి మనిద్దరం కలసినప్పుడు చెబుతానని... అంతవరకు తన బెస్ట్ విషెస్ ను అందుకోవాలని చెప్పాడు.

  • Loading...

More Telugu News