: విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు మంజూరు


విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలును నడపాలని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభును కోరానని విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రిని ఈరోజు ఆయన కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ-విజయవాడ మధ్య డబులు డెక్కర్ రైలు నడిపేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని, త్వరలోనే రైలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారని అన్నారు. అంతేకాకుండా, కాకినాడ-నరసాపురం-రేపల్లె- నిజాంపట్నం- బాపట్ల రైల్వే లైన్ పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు. కాకినాడ-నరసాపురం రైల్వే లైన్ కు బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయించాలని, నరసాపురం-బాపట్ల మధ్య అనుసంధానానికి నిధులు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు హరిబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News