: కొత్త సీఎస్ ఆల్‌రౌండ‌ర్: సీఎం కేసీఆర్


ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్‌శ‌ర్మ ఈ రోజు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని తెలంగాణ స‌చివాల‌యంలో ఆయ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాజీవ్‌శ‌ర్మ చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న ఎంతో ఓపిక‌, నేర్పుతో తెలంగాణకు సేవ‌లందించార‌ని, ఈ రోజు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా కత్తి ప్రదీప్‌చంద్ర బాధ్యతలు చేపట్టారని చెప్పారు. ప్ర‌దీప్ చంద్ర‌ కూడా ఎంతో స‌మ‌ర్థ‌తగ‌ల అధికారి అని కేసీఆర్ ప్ర‌శంసించారు. కొత్త సీఎస్ ఓ ఆల్‌రౌండ‌ర్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని రంగాల వ్య‌వ‌హారాల‌ను చక్క‌ని నేర్పుతో నిర్వ‌హించ‌గ‌ల‌డ‌ని చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌ రూపకల్పనలో ప్ర‌దీప్‌చంద్ర‌ చేసిన సేవ‌ల‌ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News