: యువరాజ్ ఇంట.. సినిమా యాక్టర్లను మించి చిందేసిన క్రికెటర్లు
సినీ నటులను టీమిండియా క్రికెటర్లు మించిపోయారు. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహోత్సవం వేడుకల సందర్భంగా జరిగిన సంగీత్ లో టీమిండియా క్రికెటర్లు చిందేశారు. ప్రధానంగా టీమిండియాలో సహచరులను ఆటపట్టించే పెళ్లి కొడుకు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ లు భాంగ్రాడాన్స్ తో అలరించగా, కోహ్లీ కూడా భాంగ్రాకు కాలు కదపడం విశేషం. దేశ, విదేశాలకు చెందిన క్రికెటర్లు కూడా యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సంగీత్ ను ఆస్వాదించారు. సంగీత్ సందర్భంగా పలువురు పంజాబీ సింగర్లతో గానకచ్చేరీ నిర్వహించారు. ఈ సంగీత్ లో బాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు.