: ఒంగోలు ఆక్స్‌ఫర్డ్ పాఠశాల ఆవరణలో పేలుడు... విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
ఒంగోలులోని అన్నవరప్పాడు ఆక్స్‌ఫర్డ్ పాఠశాల ఆవరణలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సదరు పాఠశాల వాచ్‌మెన్, బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలయిన ముగ్గురిని దగ్గరలోని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సదరు పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.