: ఒత్తిడి తట్టుకోలేకే మళ్లీ పొగతాగుతున్నాను: అమీర్ ఖాన్


ఈ ఏడాది ప్రారంభంలో పొగతాగడం మానేశానని, అయితే, ‘దంగల్’ సినిమా విడుదల నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ పొగతాగుతున్నానని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ అన్నాడు. పొగతాగకుండా ఉండాలనే ప్రయత్నించానని, కానీ, ‘దంగల్’ విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ ప్రారంభించానని .. ఈ సినిమా విడుదల తర్వాత పొగతాగడం ఆపేస్తానని చెప్పాడు. పొగతాగే అలవాటు నటనపై ఎటువంటి ప్రభావం చూపదు కానీ, ఆరోగ్యంపై చూపిస్తుందని అన్నాడు. కాగా, ‘దంగల్’ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News