: కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఏడ్చిన తల్లి... ఆమెతో పాటే అక్కడున్నవారంతా!


కొన్ని సన్నివేశాలు, సంఘటనలు ఎలాంటి వారికైనా కన్నీరు పెట్టిస్తాయి. అదే శారీరక, మానసిక లోపంతో ఉన్న వారు కన్నీరు పెడితే ఎలాంటి పాషాణ హృదయమైనా కరిగి కన్నీరుగా మారాల్సిందే. అలాంటి సన్నివేశమే ఇంగ్లండ్ లోని నార్త్ వేల్స్ లోని బాగోర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఐర్లాండ్‌ లో జరగనున్న స్పెషల్‌ ఒలింపిక్స్‌ లో స్విమ్మింగ్ విభాగంలో పాల్గొనేందుకు బాంగోర్‌ లో రీజనల్‌ స్విమ్మింగ్ ఫైనల్స్‌ నిర్వహించారు. ఇందులో ఆటిజంతో బాధపడుతున్న రోరి లోగన్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడు కూడా పాల్గొన్నాడు. ఇందులో తొలి హీట్‌ లో 50 మీటర్ల దూరాన్ని కేవలం ఒక నిమిషం మూడు సెకండ్ల వ్యవధిలోనే గమ్యాన్ని చేరుకున్న రోరి లోగన్ ఫైనల్స్‌ లో స్థానం సంపాదించాడు. నిబంధనల ప్రకారం ఫైనల్స్‌ లో ప్రదర్శించిన సామర్థ్యంలో కేవలం 15 శాతం స్పీడుతో మాత్రమే స్విమ్మింగ్‌ చేయాలి. అయితే రోరి నిబంధనల ప్రకారమే ఈత కొట్టినా, అతని వేగం 15.8 శాతం ఉండడంతో అతనిని ఈ టోర్నీ నుంచి అనర్హుడిగా నిర్ణయించారు. నిర్వాహకుల ప్రకటన విన్న రోరి తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ... 'అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా! అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నా, నన్నెందుకు డిస్ క్వాలిఫై చేశారు?' అంటూ ప్రశ్నించడంతో ఆమె కూడా కన్నీరు కార్చింది. కుమారుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్న తల్లి యాతనను చూసిన వారంతా కదిలిపోయారు.

  • Loading...

More Telugu News