: చంద్రబాబు డైరెక్షన్లో అప్పుడు వాజ్ పేయీ...ఇప్పుడు మోదీ!: వీహెచ్
అలిపిరి ఘటన తరువాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని తప్పుదారి పట్టించి, తరువాత వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయేలా చంద్రబాబు చేశారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అభిమన్యుడిని పద్మవ్యూహంలోనికి పంపినట్టుగా మోదీని నోట్లరద్దు అంశంలోకి చంద్రబాబే నెట్టారని ఆరోపించారు. దీంతో మోదీకి కూడా వాజ్ పేయీకి పట్టిన గతే పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఖర్చులు తగ్గించుకోవాలని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక క్యాంపు ఆఫీసు ఉండగా, మరో క్యాంపు ఆఫీసు నిర్మాణం చేపట్టడం వేస్టు ఖర్చు కాదా? అని ఆయన నిలదీశారు. కేసీఆర్, మోదీ మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.