: 40 బంతులు ఆడితే బౌలర్లకు చుక్కలు చూపిస్తానని అనుకున్నాను.. చూపించా!: జడేజా
40 బంతులు ఆడితే పిచ్ పై బౌలర్లకు చుక్కలు చూపిస్తానని అనుకున్నానని, అలాగే 90 పరుగులు సాధించానని రవీంద్ర జడేజా తెలిపాడు. మూడో టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడుతూ, పిచ్ పై టర్న్ లేదని అన్నాడు. దీంతో పేసర్లకు అనుకూలిస్తుందని తెలుసని చెప్పాడు. ప్రణాళికాబద్దంగా ఆడితే భారీ స్కోరు సాధించడం కష్టం కాదని భావించానని తెలిపాడు. 90 పరుగుల వద్ద నిర్లక్ష్యంగా షాట్ ఆడి వికెట్ పారేసుకున్నానని, ఇంకోసారి అలాంటి తప్పిదం చేయకూడదని భావిస్తున్నానని జడ్డూ చెప్పాడు. కాగా, ఈ టెస్టులో 90 పరుగులు చేసిన జడేజా నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.