: బ‌హిరంగంగా బెత్తం దెబ్బలతో శిక్ష... బాధతో విలవిల్లాడిపోయిన దోషులు


ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమ‌లు చేసే ఇండోనేషియాలో తాజాగా పలువురికి బ‌హిరంగంగా శిక్ష వేశారు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న కార‌ణంగా ఓ మహిళకు బ‌హిరంగంగా శిక్ష విధించారు. అంద‌రి ముందు ఆమెను బెత్తంతో ఏడు సార్లు బాదారు. నొప్పి త‌ట్టుకోలేక ఆమె కేక‌లు పెట్టింది. ఆమె చుట్టూ ఉన్న‌వారంతా ఓ సినిమా చూసిన‌ట్లు ఆమెను చూశారు. జూదం ఆడ‌డం, మద్యం సేవించ‌డం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవ‌డం, స్వలింగ సంపర్కానికి పాల్పడడం వంటి చ‌ర్య‌లు అక్క‌డ నేరాలుగా ప‌రిగ‌ణిస్తారు. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న స‌దరు మ‌హిళ‌తో పాటు మ‌రో మహిళ, ముగ్గురు పురుషులకు వేర్వేరు నేరాల‌కింద ఇదే శిక్ష‌ను అమలు చేశారు. బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద వారంద‌రికీ ఈ శిక్ష‌ను వేశారు. చేసిన పాపాల‌కు దెబ్బ‌లు తింటూ భరించలేని నొప్పితో వారంద‌రూ విల‌విల్లాడిపోయారు. ఇద్దరు కాలేజీ విద్యార్థులకు కూడా అక్క‌డ శిక్ష‌లు విధించారు. పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్న నేరం కింద వారిద్ద‌రికీ 100 చొప్పున బెత్తం దెబ్బలుపడ్డాయి. వివాహం కాకుండానే ఓ యువతితో సంబంధం పెట్టుకుని ఆమెను గ‌ర్భ‌వ‌తిని చేసినందుకు ఓ వ్య‌క్తికి 22 బెత్తం దెబ్బ‌లు శిక్ష‌గా విధించారు. గ‌ర్భంతో ఉన్న ఆమెకు మాత్రం ఏ శిక్ష విధించేదీ ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు. గర్భిణులకు శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.

  • Loading...

More Telugu News