: ముల్లంగి దొంగిలించాడంటూ దళితుడిపై కాల్పులు


తన పొలంలో ముల్లంగి దొంగిలించాడనే కారణంతో ఓ దళితుడిపై గ్రామ పెద్ద తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, సునీల్ కుమార్ (30) అనే దళితుడు తన పొలంలో ముల్లంగిని దొంగిలించాడని ఆరోపిస్తూ... గ్రామ పెద్ద నిన్న రాత్రి సునీల్ ఇంటిపై దాడిచేశాడు. తన మందీమార్బలంతో వెళ్లిన ఆయన సునీల్ కుటుంబ సభ్యులను సైతం కొట్టాడు. ఈ క్రమంలో, తనపై ఎదురు తిరిగిన సునీల్ పై తన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సర్కిల్ ఇన్స్ పెక్టర్ మాట్లాడుతూ, నిందితులంతా పరారీలో ఉన్నారని తెలిపారు. సునీల్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. గ్రామంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News