: నడిగర్ సంఘంపై సీనియర్ నటి రాధిక సీరియస్


నడిగర్ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం)పై సీనియర్ నటి, నిర్మాత రాధిక మండిపడ్డారు. నడిగర్ సర్వసభ్య సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు, తన భర్త శరత్ కుమార్ ను, సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి రాధారవిలపై శాశ్వత వేటు వేశారు. దీనిపై రాధిక ట్విట్లర్లో విరుచుకుపడ్డారు. నడిగర్ సంఘంలో శాశ్వత సభ్యురాలినైన తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా... కోరం కూడా లేకుండానే ఏజీఎంను ఎలా నిర్వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ఎవరినైనా తొలగించాలంటే కనీసం 21 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలన్న నియమాన్ని మీరు ఉల్లంఘించారంటూ మండిపడ్డారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News