: అమెరికాలో ప్రమాదం... ఎన్నారై యువతి శెట్టిపల్లి సుష్మ, ఆమె కుమారుడు మహీధర్ మృతి


అమెరికాలోని చికాగో సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏ ఎన్నారై యువతిని, ఆమె రెండేళ్ల కుమారుడి ప్రాణాలను బలిగొంది. సెయింట్ లూయిస్ మీదుగా ప్లానోకు శెట్టిపల్లి రత్నాకర్, ఆయన భార్య సుష్మ, రెండేళ్ల కుమారుడు మహీధర్ వెళుతున్న వేళ, రాంగ్ రూట్ లో వేగంగా, ఎదురుగా వచ్చిన మరో వాహనం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవింగ్ చేస్తున్న సుష్మ, మహీధర్ అక్కడికక్కడే మృతి చెందగా, వాహనంలోని మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రత్నాకర్ కూడా ఉన్నారు. గాయపడ్డవారి శరీరంలో పలు చోట్ల ఎముకలు విరిగినట్టు తెలుస్తోంది. సెయింట్ లూయిస్ లోని మెర్సీ హాస్పిటల్ లో క్షతగాత్రులకు చికిత్స అందుతోందని, ప్రమాదంలో రాంగ్ రూటులో వచ్చిన వాహనం డ్రైవర్ కూడా మరణించాడని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News