: లక్షల మంది చట్ట వ్యతిరేకంగా ఓటేశారు... లేకుంటే పాప్యులర్ ఓట్లూ నావే: డొనాల్డ్ ట్రంప్


అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో లక్షలాది మంది చట్ట వ్యతిరేకంగా ఓట్లు వేశారని, అదే జరగకుంటే, పాప్యులర్ ఓట్లు సైతం తనకే వచ్చేవని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు. స్వింగ్ రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిచిగన్, పెన్సిల్వేనియాల్లో గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో హిల్లరీ క్లింటన్ సైతం రీ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పలు ట్వీట్లు చేశారు. తనకు అధిక ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వచ్చాయని, పాప్యులర్ ఓట్లు రానందుకు తానేమీ బాధపడటం లేదని, చట్ట వ్యతిరేక ఓట్లు లేకుంటే ఆ విభాగంలోనూ తనదే విజయమని చెప్పారు. హిల్లరీ వర్గం రీ కౌంటింగ్ తరువాత పొందే ప్రయోజనం శూన్యమని అన్నారు.

  • Loading...

More Telugu News