: 'మోదీని నా భర్త వ్యతిరేకిస్తున్నారు.. విడాకులు ఇచ్చేస్తా'నంటున్న మహిళ!

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విమర్శిస్తున్న తన భర్త తీరు తనకు నచ్చడం లేదని, అవసరమైతే ఆయనకు విడాకులు ఇచ్చేస్తానని రష్మీన్ జైన్ అనే ఒక మహిళ అంటోంది. ఒకటిన్నర నిమిషం నిడివి గల వీడియోలో ఈ విషయమై ఆమె మాట్లాడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. ఆ మహిళ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో తెలియదు. పెద్దనోట్ల రద్దును విమర్శిస్తూ, మోదీకి వ్యతిరేకంగా తన భర్త మాట్లాడుతున్నాడని, అవసరమైతే ఆయనకు విడాకులు ఇచ్చేస్తానని ఆ వీడియోలో ఆమె పేర్కొంది. ఎటువంటి స్వార్థం లేకుండా మోదీ పనిచేస్తున్నారని, ఆ విధంగా పనిచేసేవాళ్లు ఎంతమంది ఉంటారని ఆమె ప్రశ్నించారు.

More Telugu News