: ‘ఖలిస్థాన్’ ఉగ్రవాదులను తప్పించడంలో ప్రభుత్వ హస్తం ఉంది: అమరీందర్ సింగ్ ఆరోపణ
‘ఖలిస్థాన్’ ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోవడంలో ప్రభుత్వ హస్తం ఉందని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ ఆరోపించారు. ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ తో పాటు గురు ప్రీత్ సింగ్, వికీ గోండ్రా, విక్రమ్ జిత్ సింగ్, నితిన్ డియోల్ అనే మిలిటెంట్లను హై సెక్యూరిటీ ఉన్న నభా జైలు నుంచి తప్పించిన తీరు చూస్తుంటే.. ఇందులో ప్రభుత్వ హస్తం ఉందని స్పష్టం అవుతోందని ఆయన ఆరోపించారు. జైలులోకి ప్రవేశించిన దుండగులను పోలీసులు ఏమాత్రం అడ్డుకోకపోవడం చూస్తుంటే ఉన్నత అధికారుల స్థాయిలో ముందస్తు ప్రణాళిక చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఈరోజు విలేకరులతో మాట్లాడిన అమరీందర్ సింగ్ విమర్శించారు.