: ప్రేమజంట విషాదం- నిన్న పెళ్లి...నేడు ఆత్మహత్య
ఒక ప్రేమ జంట.. నిన్న పెళ్లి చేసుకుంది.. ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం నాగులగుట్ట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ప్రేమికుల జంట నిన్న పెళ్లి చేసుకున్నారు. మరి, ఏమైందో ఏమో కానీ, ఈరోజు ఉదయం గ్రామంలోని చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రమేష్, మాధవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రమేష్ స్థానికంగా ఒక చోట పని చేస్తుండగా, మేడ్చల్ లోని ఒక కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం మాధవి చదువుతోంది. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ వ్యవహారంపై కొన్ని రోజుల కిందట ఒక పంచాయితీ జరిగింది. రెండు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరంచలేదు. దీంతో, మనస్తాపం చెందిన ఈ జంట గ్రామంలోని చెట్టుకు ఉరి వేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.