: 13,629 ఓట్లను తప్పుగా లెక్కించి వుంటే, హిల్లరీయే విజేత!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా విస్కాన్సిన్ రాష్ట్రంలో తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టనుండటం అత్యంత ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుండగా, అన్ని పార్టీలూ రీకౌంటింగ్ ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి విస్కాన్సిన్ లో హిల్లరీ కన్నా ట్రంప్ కు 27,257 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ మెజారిటీ తక్కువే. ఇక రీ కౌంటింగ్ లో కనీసం 13,629 ఓట్లను తప్పుగా లెక్కించారని తేలితే, విస్కాన్సిన్ లో హిల్లరీ విజేతగా నిలుస్తారు. ఆ మేరకు ఓట్లు హిల్లరీకి వస్తాయి కాబట్టి, ట్రంప్ పై 1 ఓటు తేడాతో హిల్లరీ నెగ్గుతారు. ఆ వెంటనే స్వల్ప మెజారిటీతో ట్రంప్ గెలిచిన మిచిగన్ (10,704), పెన్సిల్వేనియా (70,010) రాష్ట్రాల్లోనూ రీకౌంటింగ్ కు పార్టీలు పట్టుబడతాయి. వాటిల్లోనూ రీకౌంటింగ్ తప్పనిసరి అవుతుంది. ఆ ఫలితాల్లోనూ తప్పు లెక్కలు ఉంటే, హిల్లరీదే విజయం అవుతుంది. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిచిగన్ లో 5,353 ఓట్లను, పెన్సిల్వేనియాలో 35,006 ఓట్లను హిల్లరీ అధికంగా తెచ్చుకుంటే మాత్రం ఫలితం తారుమారై అధ్యక్ష పీఠం ఆమెను వరిస్తుంది.