: కేటీఆర్ తీసుకున్న క్రేజీ సెల్ఫీ... వెనక వరుసగా రాంచరణ్, సానియా మీర్జా, రాశీ ఖన్నా... మీరూ చూడండి!


ఈ ఉదయం హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో 10కే రన్ ఘనంగా జరుగగా, పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్వయంగా పాల్గొని ఔత్సాహికుల్లో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు సెలబ్రిటీలను భాగం చేస్తూ, ఆయన తీసుకున్న ఓ క్రేజీ సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కేటీఆర్ స్వయంగా ఈ ఫోటోను తీసుకోగా, ఆయన వెనుక వరుసగా హీరో రాంచరణ్ తేజ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, హీరోయిన్ రాశీ ఖన్నా, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులంతా క్యూ కట్టారు. అన్నట్టు కేటీఆర్ తీసిన ఈ సెల్ఫీని సానియామీర్జా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. కేటీఆర్ తీసుకున్న క్రేజీ సెల్ఫీని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News