: ఇలా అయితే క్రికెట్ ఆదరణ కోల్పోతుంది: షోయబ్ అఖ్తర్

ఐసీసీ వ్యవహారశైలితో క్రికెట్ ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉందని వెటరన్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ హెచ్చరించాడు. కరాచీలో ఆయన మాట్లాడుతూ, నిబంధనల పేరిట ఫాస్ట్ బౌలర్లకు ఐసీసీ ఊపిరి ఆడకుండా చేస్తోందని అన్నాడు. క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లే రియల్ క్యారెక్టర్లన్న విషయాన్ని ఐసీసీ గుర్తుంచుకోవాలని అఖ్తర్ తెలిపాడు. 60, 70 దశకాల్లో బౌలర్లపై ఎటువంటి ఒత్తిడి ఉండేది కాదని ఆయన చెప్పాడు. ఆటగాళ్ల భావోద్వేగాల విషయంలో ఐసీసీ ఎన్నో నిబంధనలు విధిస్తోందని, తద్వారా పేసర్లలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఐసీసీ నిబంధనలు బ్యాట్స్ మన్ కు అనుకూలంగా ఉంటున్నాయని ఆరోపించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ లో పాక్ ఆటగాళ్ల ప్రదర్శన ఊహించినంత గొప్పగా లేదని తెలిపాడు.

More Telugu News