: షాకింగ్ వీడియో... కప్ప నోట్లో గిజగిజలాడిన పాము!
కప్పను పాము మింగడం సర్వసాధారణం. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా కప్పే పామును మింగుతుంటే, గిజగిజలాడిన వైనం ఇది. తనలోని సగభాగం కప్పు నోట్లో ఉండడంతో, ప్రాణాల కోసం ఆ పాము పోరాడింది. అంతటి కష్టంలోనూ అదే సమయంలో తన మీదకి వచ్చిన ఓ పిల్లిపైకి బుస కొడుతూ ఎగిరింది పాము. దాని బుసలకు పిల్లి పలాయనం చిత్తగించింది. కాసేపటి తర్వాత కప్పతో కూడా పోరాడి విడిపించుకోవడమే కాకుండా, ఆ కప్పను మింగేసి కక్ష తీర్చుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్ అప్ లోడ్ చేయడంతో అది అందర్నీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఆ చిత్రాన్ని చూడండి.