: భారత్ గొప్ప స్నేహితుడిని కోల్పోయింది: క్యాస్ట్రో మృతికి ప్రధాని మోదీ సంతాపం
క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో (90) మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. భారత్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 20వ శతాబ్దపు ప్రపంచ గొప్పనేతల్లో క్యాస్ట్రో ఒకరని ఆయన అన్నారు. భారత్ ఆయన మృతికి సంతాపం తెలుపుతోందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఫిడెల్ క్యాస్ట్రో మృతిపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వామపక్ష నేతలు సీతారం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డిలు సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.