: గల్లంతైన ఇద్దరు చైనా యాత్రికులను రక్షించిన భారత నేవీ
మాల్దీవుల సముద్ర జలాల్లో నిన్న సాయంత్రం ఇద్దరు చైనా యాత్రికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సిబ్బంది వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి చివరకు ఈ రోజు వారి ఆచూకీని కనుగొని, వారిని కాపాడారు. చైనా యాత్రికులు గల్లంతు అయినప్పటి నుంచి వారి కోసం భారతీయ నేవీ హెలికాప్టర్ ద్వారా గాలింపులు చేపట్టి, చివరకు తన ప్రయత్నంలో సఫలమయింది.