: జయలలిత కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు.. త్వరలోనే నడుస్తారు: అపోలో ఆసుప‌త్రి ఛైర్మన్


జ్వరం, డీ హైడ్రేషన్‌తో బాధ‌ప‌డుతూ సెప్టెంబ‌రు 22న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) కాలర్ మైకు ద్వారా కొన్ని నిమిషాలు మాట్లాడారని అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత మెరుగుప‌డింద‌ని, ప్ర‌స్తుతం ఆమె కీలక అవయవాల‌ పనితీరు మెరుగ్గా ఉంద‌ని చెప్పారు. జ‌య‌ల‌లిత‌కు చికిత్స‌లో భాగంగా ప్రతిరోజూ కొద్దిస‌మ‌యం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుప‌త్రిలో ఆమె స్టాటిక్, యాక్టివ్ ఫిజియోథెరపీ తీసుకుంటున్నార‌ని కొన్ని రోజుల్లో ఆమె లేచి నిలబడి, నడుస్తార‌ని చెప్పారు. జ‌య‌ల‌లిత ఎప్పుడు డిశ్చార్జి కావాల‌న్న‌ది ఆమె ఇష్టమేనని చెప్పారు.

  • Loading...

More Telugu News