: ఆర్బీఐ గవర్నర్ తప్పిపోయారు...పట్టుకున్న వారికి నగదు బహుమానం: సోషల్ మీడియాలో సెటైర్లు
500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ కనిపించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంత మంది నెటిజన్లు ఆర్బీఐ గవర్నర్ తప్పిపోయారంటూ పోస్టర్లు పెట్టిమరీ విమర్శించడంతో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్ లో 'ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తప్పిపోయారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. చివరిసారి ఆయనను ఆర్బీఐ బిల్డింగ్ లో చూశారు. దయచేసి ఇంటికి రావలెను. అందరూ క్షమించేశారు. ఆయనను తెచ్చిచ్చిన వారికి బహుమతి ఇవ్వబడును' అంటూ ఒక ఫోన్ నెంబర్ ను ఇచ్చి సంప్రదించాలని పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ కనిపిస్తే 011 2371 0538 నెంబర్ కు ఫోన్ చేసి తెలిపాలని పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.