: ఒకే కారులో జాహ్నవి-బాయ్ ఫ్రెండ్.. శ్రీదేవి దంపతులు కూడా!
ప్రముఖ నటి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ల కుమార్తె జాహ్నవి ప్రేమలో పడిందనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియాతో జాహ్నవి ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి ప్రేమకు శ్రీదేవి దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అనే అనుమానం తలెత్తేలా తాజాగా ఓ సంఘటన జరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ‘డియర్ జిందగీ’ చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్ కు శ్రీదేవి, బోనీకపూర్, జాహ్నవితో పాటు శిఖర్ పహరియా కూడా హాజరయ్యారు. ఒకే కారులో వీరు నలుగురు కలిసి ప్రయాణం చేశారు. శ్రీదేవి కుటుంబంతో కలిసి శిఖర్ పహరియా కనిపించడం ఇదే తొలిసారి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో వైరల్ గా మారాయి. కాగా, బాయ్ ఫ్రెండ్స్ కు, ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లొద్దంటూ కూతురు జాహ్నవికి శ్రీదేవి వార్నింగ్ ఇచ్చిదంటూ బాలీవుడ్ వర్గాల్లో ఇటీవల ప్రచారం జరిగింది.