: తగ్గిన వెండి, బంగారం ధరలు


నోట్ల రద్దు తరువాత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు నష్టపోయి 25,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 7,965 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్స్ అమ్ముకునేందుకు విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో టాటా మోటార్స్, ఆదాని పోర్ట్స్, యాక్సెస్ బ్యాంక్, సన్‌ ఫార్మా షేర్లు నష్టపోగా, టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. బులియన్ మార్కెట్ సైతం ఒడిదుడుకులతో సాగింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 28,719 రూపాయలు కాగా, కేజీ వెండి ధర 40,250 రూపాయలుగా ఉంది.

  • Loading...

More Telugu News