: మోదీజీ.. డబ్బు డిపాజిట్ చేసి విత్ డ్రా చేసే అవకాశం లేని ఒక దేశం పేరు చెప్పండి?: మన్మోహన్ సింగ్


‘నరేంద్ర మోదీజీ.. డబ్బు డిపాజిట్ చేసి విత్ డ్రా చేసే అవకాశం లేని ఒక దేశం పేరు చెప్పండి?’ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశ్నించారు. సామాన్యుల బాధలను అర్థం చేసుకోవాలని, పెద్దనోట్లను మార్చుకునే విషయమై కేంద్రం ఇచ్చిన యాభై రోజుల గడువు సరిపోదని, పేద ప్రజలకు 50 రోజులు కష్టాలేనని అన్నారు. నల్లధనం నియంత్రణకు పెద్దనోట్ల రద్దు ఉపయోగకరమన్న వాదనను అంగీకరించనని అన్నారు. నిబంధనలు మారుస్తూ ఆర్బీఐ ప్రతిష్టను దిగజార్చవద్దని, సహకార బ్యాంకుల్లో పెద్దనోట్ల తీసుకోవద్దన్న నిర్ణయం సరికాదని రాజ్యసభలో మన్మోహన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News