: ఈ అర్ధరాత్రి నుంచి బ్యాంకుల్లో నోట్ల మార్పిడి బంద్


కాసేపట్లో కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానున్న తరుణంలో ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దయిన పెద్దనోట్లపై కేంద్రం మరోషాక్ ఇచ్చింది. ఈ అర్ధరాత్రి నుంచి బ్యాంకుల్లో కూడా నోట్ల మార్పిడికి కూడా అవకాశం లేదని ప్రకటించింది. కేవలం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మాత్రమే పాతనోట్లను ఎప్పటిలాగే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. స్థానిక సంస్థల్లో బిల్లుల చెల్లింపులకు కొన్ని సడలింపులు ఇచ్చింది. పాతనోట్లతో బకాయిల చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. నీరు, విద్యుత్ బిల్లులు, గవర్నమెంటు స్కూళ్లు, కాలేజీల ఫీజుల చెల్లింపులకు, మొబైల్ రీఛార్జ్ లకు పాత ఐదు వందల నోట్లను వినియోగించవచ్చు. కానీ, వెయ్యిరూపాయల నోట్లతో చెల్లింపులకు అవకాశం లేదు. వెయ్యినోట్లను కేవలం డిపాజిట్ చేయడానికి మాత్రమే పరిమితం చేశారు.

  • Loading...

More Telugu News