: ప్రధాని మోదీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు


ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఫిరంగిపురంలో ఏటీఎం క్యూ లైన్లో నిల్చుని గుండెపోటుతో పోలంకి ఇన్నయ్య అనే వ్యక్తి మృతిచెందారు. అతని మృతికి బాధ్యత వహించాలంటూ అతని బంధువులు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో స్టేషన్ ఇన్ ఛార్జ్ లేకపోవడంతో ఫిర్యాదు చేసి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఫిరంగిపురం తహశీల్దారుకు ఇన్నయ్య బంధువులు వినతి పత్రం ఇచ్చారు. ఇందులో ఇన్నయ్య కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, పెద్దనోట్లను రద్దు చేస్తూ మోదీ నిర్ణయం తీసుకున్న అనంతరం పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News