: హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్ తో పీవీ సింధు తలపడే అవకాశం
మోకాలి శస్త్ర చికిత్స తర్వాత భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పాల్గొన్న మొదటి టోర్నీలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోంది. ఈ రోజు జరిగిన రెండో రౌండ్లో జపాన్ షట్లర్ సయాక శాటోతో చివరివరకు పోరాడిన సైనా 21-18, 9-21, 21-16తో విజయ ఢంకా మోగించింది. మరోవైపు ఇదే టోర్నీలో సింధు కూడా అద్భుతంగా రాణిస్తుండడంతో సెమీస్‌లో ఒకరినొకరు ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలున్నాయి. ఇప్పుడు వీరిద్దరి లక్ష్యం బీడబ్లూఎఫ్ సూపర్ సిరీస్ మాస్టర్స్‌పైనే ఉంది. మెరుగ్గా రాణిస్తూ టాప్-8లో ఉంటేనే మన హైదరాబాదీలకు అందులో ఆడే ఛాన్స్ లభిస్తుంది.