: ఉద్యోగి ప్యాంటు జేబులో పేలిన ఈ-సిగరెట్
ప్యాంటు జేబులో పెట్టుకున్న ఈ-సిగరెట్ పేలిన సంఘటనలో ఒక ఉద్యోగి గాయాలపాలయ్యాడు. న్యూయార్క్ సిటీలోని వైన్ స్టోర్ లో నిన్న జరిగిన ఈ సంఘటనలో అతని కాలు, తొడ, చేతులకు గాయాలయ్యాయి. వైన్ స్టోర్ కౌంటర్ వెనుక నిలబడ్డ 31 సంవత్సరాల ఒటిస్ గూడింగ్ తన సహోద్యోగులతో నిలబడి మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సెక్యూరిటీ కెమెరా వీడియో ద్వారా తెలుస్తోంది. గూడింగ్ ప్యాంటులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ఈ-సిగిరెట్ ను తన జేబులో నుంచి తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ గూడింగ్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలను పరిశీలించిన వైద్యులు గూడింగ్ కు శస్త్రచికిత్స అవసరమని చెప్పినట్లు ఆయన తరపు లాయర్ శాన్ ఫోర్డ్ రుబెన్ స్టిన్ పేర్కొన్నారు.