: అక్రమంగా కొత్తనోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా అరెస్టు
అక్రమంగా కొత్తనోట్ల మార్పిడి చేస్తున్న ముఠాను విశాఖపట్టణం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద ర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఈ ముఠాలోని పది మంది సభ్యులు సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ సంస్థలో పనిచేస్తున్నారన్నారు. ఏటీఎంలలో పెట్టాల్సిన నగదును దారిమళ్లించిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ.35 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.