: దమ్ముంటే ఎన్నికలకు రా?: మోదీకి మాయావతి సవాల్


నరేంద్ర మోదీ యాప్ ద్వారా 90 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు మద్దతిస్తున్నారని చెప్పుకోడవం సిగ్గుచేటని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నిప్పులు చెరిగారు. ఈ సర్వే తప్పుడు సర్వే అని, ఫలితాలను డబ్బులిచ్చి రాయించుకున్నారని ఆరోపించిన ఆమె, మోదీకి ధైర్యం, దమ్ముంటే లోక్ సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు తమ ఫలితాలను వెల్లడిస్తారని, దాన్నే సర్వే ఫలితంగా తీసుకోవచ్చని అన్నారు. కాగా, నోట్ల రద్దును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మాయావతి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News