: అట్టహాసంగా కేసీఆర్ నూతన గృహ ప్రవేశం.. పలువురు ప్రముఖుల హాజరు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ తెల్లవారుజామున 5.22 గంటలకు నూతన గృహ ప్రవేశం చేశారు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో ఆయన నూతన గృహంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి సహా పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 38 కోట్ల రూపాయల అంచనాలతో మూడు బ్లాకులుగా నిర్మాణం చేపట్టారు. ఐదు భవనాల సముదాయానికి 'ప్రగతి భవన్'గా నామకరణం చేశారు. ప్రాంగణమంతా పచ్చదనంతో వెల్లివిరిసేలా వివిధ మొక్కలు నాటారు. ఏకకాలంలో వెయ్యిమందితో సమావేశమయ్యేలా సమావేశమందిరాన్ని తీర్చిదిద్దారు. సమావేశ మందిరానికి 'జనహిత' అనే పేరు పెట్టారు.