: పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల్లో రద్దయిన నోట్లు వేసుకోవచ్చు
రద్దయిన పెద్ద నోట్లతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఒక శుభవార్త. రూ.500, రూ.1000 నోట్లను పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన చేసింది. కాగా, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలలో పెద్దనోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని, రూ.500, రూ.1000 నోట్లను పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లలో కూడా జమ చేసేందుకు వీలు లేదని ఆర్బీఐ నిన్న ప్రకటించింది. ఈ రోజు చేసిన ప్రకటనలో పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లకు అందుకు మినహాయింపును ఇచ్చింది.