: పెద్ద నోట్లు ఇంకా చెల్లుతున్నాయి...ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా?


కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 1000, 500 నోట్లు చెల్లుబాటు కావడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ నోట్లను దేశవ్యాప్తంగా ఎవరూ తీసుకోవడం లేదు. ప్రభుత్వం చెప్పిన ఆసుపత్రులు, మందుల షాపుల్లో కూడా చెల్లడం లేదు. ఈ నేపథ్యం ఈ నోట్లు విజయవాడలోని ఓ ప్రాంతంలో చెల్లుబాటులో ఉన్నాయి. వారధి పక్కనున్న పేకాట క్లబ్ లో ఈ నోట్ల వాడకం విరివిగా ఉంది. రద్దయిన నోట్లతో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. భారీ మొత్తాలతో పందాలు కాస్తూ పేకాడేస్తున్నారు. ఈ క్రమంలో లక్షల రూపాయల పెద్దనోట్ల కట్టలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చేతులు మారిన నోట్లు తరువాత 'జన్ థన్' ఖాతాల ద్వారా వైట్ మనీగా తెల్లరంగుపూసుకుంటున్నాయని, అలా మారని మొత్తాన్ని వారధిలో పడేసి వెళ్లిపోతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News