: మంచి కథ దొరికితే మల్టీస్టారర్ లకు నేనెప్పుడూ రేడీయే: నారా రోహిత్


మంచి కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు తానెప్పుడూ సిద్ధమేనని ప్రముఖ నటుడు నారా రోహిత్ తెలిపాడు. తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ, ఇద్దరు హీరోలకు ఆస్కారం ఉండే కథలతో ఎవరైనా వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. జనవరిలో రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయని రోహిత్ తెలిపాడు. బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఘనవిజయం సాధిస్తుందని రోహిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో తానేపాత్ర ధరించనప్పటికీ కథ, కథనాలపై ఆసక్తితోనే షూటింగ్ కు వెళ్లానని, సినిమా అద్భుతంగా వస్తోందని రోహిత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News