: దివీస్ ఫార్మా నుంచి జగన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు: దేవినేని
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసుకుని దివీస్ ఫార్మా మొండిగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే సమస్యలు తప్పవంటూ జగన్ చేసిన హెచ్చరికలను ఉమా తప్పుబట్టారు. అసలు దివీస్ ఫార్మాను అడ్డుకునే ప్రయత్నం జగన్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాంకీ ఫార్మా ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు. దివీస్ ఫార్మా నుంచి జగన్ ముడుపులను ఆశిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు కుటుంబంపై, హెరిటేజ్ సంస్థపై అవాస్తవాలను ప్రచారం చేసేందుకు ఇద్దరు ఆంబోతులను జగన్ వదిలారని అన్నారు.