: మంగళంపల్లి మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు: సీఎం జయలలిత
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన సంతాపం వ్యక్తం చేశారు. బాలమురళీకృష్ణ మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని అన్నారు. కాగా, బాలమురళీ మృతిపై తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా సంతాపం వ్యక్తం చేశారు. కాగా, చెన్నైలోని కనకశ్రీనగర్ లోని స్వగృహంలో బాలమురళీ కృష్ణ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.