: మంగళంపల్లి ప్రపంచం గర్వించదగ్గ విద్వాంసుడు: కమలహాసన్
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం కలచివేసిందని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప సంగీతవిద్వాసుడని అన్నారు. ఆయన మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన చెప్పారు. పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, వేదం, నాదం మేళవింపే మంగళంపల్లి బాలమురళీకృష్ణ అన్నారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి, తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. సంగీత ప్రపంచం గొప్ప విద్వాంసుడ్ని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం తీరని లోటని ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి తెలిపారు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చెబుతూ, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. గొప్ప సంగీత విద్వాంసుడ్ని దేశం కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.