: ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
ఇద్దరు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపాయి. జమ్ముకశ్మీర్ బండీపురాలోని హంజన్ ప్రాంతంలో ఈ ఉదయం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారన్న సమాచారంతో భారత సైనికులు అక్కడకు వెళ్లి, ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలో, అక్కడే నక్కి ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరపగా, ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చనే సమాచారంతో, గాలింపు కొనసాగిస్తున్నారు మన జవాన్లు. మరోవైపు, ఆర్ఎస్ పురా సెక్టార్లో భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన పాక్ జాతీయుడిని సైన్యం హతమార్చింది.