: పేదల ఆకలి తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండటం మన అదృష్టం: మంత్రి తలసాని
పేదల ఆకలి తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండటం మన అదృష్టమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం చాలా గొప్ప కార్యక్రమం అని, నీటి వనరులు ఉన్న చోట చేప పిల్లలను పెంచాలని మత్స్యకారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మత్స్యకార వృత్తి బాగుపడుతుందని నాడే చెప్పారని తలసాని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.