: 92 పైసలు కడితే రూ. 10 లక్షల బీమా... తొలిసారి పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ ప్రమాద బాధితులకు వర్తింపు
రైలు ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకం బాధిత కుటుంబాలకు ఎంతో స్వాంతన చేకూర్చబోతోంది. మన దేశ చరిత్రలో ఇలాంటి పథకాన్ని తొలిసారిగా తీసుకువచ్చారు. రైలు ప్రయాణం కోసం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు 92 పైసలను అదనంగా చెల్లిస్తే, వారికి రూ. 10 లక్షల వరకు గరిష్ట బీమా కల్పిస్తామని గత బడ్జెట్ లో రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. దీంతో, ఈ పథకం ద్వారా తొలిసారిగా పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు బీమా మొత్తాన్ని చెల్లించనున్నారు. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు... 92 పైసలను ప్రీమియం రూపంలో ఐఆర్సీటీసీకి చెల్లించాల్సి ఉంటుంది. 92 పైసలు చెల్లించిన ఏ తరగతి ప్రయాణికుడికైనా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, సబర్బన్ రైళ్లకు మాత్రం ఈ పథకం వర్తించదు.