: మరో ఘనత సాధించిన రవిచంద్రన్ అశ్విన్


టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా అశ్విన్ అవతరించాడు. 2016లో ఇప్పటి వరకు 55 వికెట్లు తీసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఈ క్రమంలో, 54 వికెట్లతో ఇప్పటిదాకా తొలి స్థానంలో ఉన్న శ్రీలంక స్పిన్నర్ హెరాత్ ను అశ్విన్ అధిగమించాడు. ఈ ఏడాది ఐదు వికెట్లను అశ్విన్ ఆరు సార్లు తీశాడు. 10 వికెట్లను రెండు సార్లు తీశాడు. విశాఖలో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించిన అశ్విన్... రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News